సెల్ఫీ అడిగిందని అక్కడే పుషప్ లు చేయమన్నాడు….!

ఇండియన్ మోడల్, నటుడు మిలింద్ సోమన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ 53 ఏళ్ళ ఫిట్నెస్ ఫ్రీక్ మూడేళ్ళ క్రితం 28ఏళ్ల వయసున్న యంగ్ మోడల్ అంకిత కొన్వర్ ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను ఫిట్నెస్ గురించి టిప్స్ చెప్పే ఈ నటుడిని మరోమారు నెటిజన్లు టార్గెట్ చేశారు. ఆయన ఇటీవల ఒక పాత వీడియో తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆ వీడియోలో సెల్ఫీ అడిగిన మహిళను 10 పుషప్‌లు చేయమని అడగడంతో ఆమె వెంటనే పుషప్‌లు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మిలింద్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. రాయ్‌పూర్‌లోని ఓ ప్లేస్ లో సెల్ఫీ అడిగిన ఆమెను ఇలా చేయించానని చెప్పుకొచ్చాడు. తర్వాత సోమన్ ఆ మహిళతో సెల్ఫీ దిగారు. అయితే ఆ మహిళ చీర ధరించి, అది కూడా రోడ్డు మీద పుషప్ లు చేయడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. ఇంకేముంది ఆయన ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ ఇలా చేయడం సరికాదంటూ నెటిజన్లు మిలింద్ కు చురకలు అంటిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-