55 ఏళ్ల భర్త! 29 ఏళ్ల భార్య! ‘గ్యాప్’ తప్పేం కాదంటోన్న గార్జియస్ బ్యూటీ!

వాళ్లిద్దరూ మారథాన్ రన్నర్స్. ఒక్కసారి మొదలెడితే సూపర్బ్ గా రన్నింగ్ చేస్తారు. అందుకే, ఒకరికి ఒకరు నచ్చేయటంతో జీవితంలోనూ కలసి పరుగులు తీద్దామని డిసైడ్ అయ్యారు. సీన్ కట్ చేస్తే, అతడ్ని ఆమె 2018లో పెళ్లాడింది. ఇందులో పెద్ద విశేషం ఏంటి అంటారా? అతడికి 55, ఆమెకి 29… అదే సమ్ థింగ్ స్పెషల్! సూపర్ మోడల్ గా అమ్మాయిల మనసు దోచిన అందగాడు మిలింద్ సోమన్. అయితే, అతను లేటు వయస్సులో లేత సుందరిని పెళ్లాడటం అప్పట్లో బాగా చర్చకు దారి తీసింది. ఇద్దరి మధ్యా ఒకటిన్నర దశాబ్దం తేడా ఉండటం కొంత ఆశ్చర్యమే కదా! అందుకే, అలవాటులో భాగంగా జనం ముక్కున వేలేసుకున్నారు. దీనిపై మరోసారి స్సందించింది మిసెస్ మిలింద్ సోమన్… అంకితా కోన్వర్. ‘నేను ఎప్పుడు నాకు ఏది సంతోషం కలిగిస్తే అదే చేశాను’ అంటోంది అంకిత. అందుకే తనకంటే వయస్సులో పెద్దవాడైనా కూడా మిలింద్ ని మనువాడిందట.

ఇన్ స్టాగ్రామ్ లో ఓ నెటిజన్ ప్రశ్నకి ఆమె బదులు ఇచ్చింది. ‘ప్రత్యేకంగా ఇండియన్ స్టీరియోటైప్స్ అంటూ ఏమీ ఉండరు. ప్రపంచం అంతా స్టీరియోటైప్స్ ఉంటారు. ఏదైనా మనకు తెలియంది ఎదురైతే వింతగా చూడటం మానవ సహజం. అందుక్కారణం ఆ తెలియని దాని పట్ల మనలో ఉండే భయం. నిజానికి అది మనిషికి ప్రకృతి ఇచ్చిన ముందు జాగ్రత్త పరికరం. కానీ, చాలా సార్లు మనుషులు తమ భయాన్ని కంట్రోల్ చేసుకోలేక ప్రతీ చిన్న విషయాన్ని వింతగా, విచిత్రంగా చూస్తూ అతిగా చర్చించుకుంటారు!’ అని అంకితా కాస్తంత లెంగ్తీ థియరీ చెప్పింది. ఏది ఏమైనా ఆమె చెప్పిన దాంట్లో నిజం కూడా లేకపోలేదు! ముదురు మగాళ్లతో ముద్దుగుమ్మల మురిపాలు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉన్నాయి. కాకపోతే, కొంచెం అరుదుగా కంట పడుతుంటాయంతే!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-