బాక్సింగ్ లెజెండ్ తో ‘లైగర్’ టీమ్!

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’ షూటింగ్ అమెరికాలో శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బాక్సింగ్ లెజెండ్ మైక్ టైనస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి యూనిట్ అక్కడకు వెళ్ళింది. మంగళవారం మైక్ టైనస్ తో తాను దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసి విజయ్ దేవరకొండ బుధవారం తన చిత్ర దర్శక నిర్మాత పూరి జగన్నాథ్, నిర్మాణ భాగస్వామి ఛార్మి, హీరోయిన్ అనన్యపాండే తో కలిసి మైక్ టైనస్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Read Also : కేటీఆర్ మంచి నటుడు… ఇంకా నయం సినిమాల్లోకి రాలేదు !

దానికి సింపుల్ గా ‘మ్యాజిక్’ అనే పదం వాడాడు. నిజానికి ‘లైగర్’ టీమ్ లోకి మైక్ టైనస్ వచ్చినప్పుడే ఓ కొత్త మ్యాజిక్ క్రియేట్ అయ్యింది. దానిని వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని భారతీయ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. మూవీ టీమ్ మైక్ టైసన్ తో రకరకాల ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం మీద ‘లైగర్’ టీమ్ మైక్ టైసన్ తో బాగానే ఛిల్ అవుతున్నారు!!

Image
Image
Image

Related Articles

Latest Articles