లెజెండరీ బాక్సర్ తో రౌడీ ‘లైగర్’ నవ్వులు..

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కనిపించనుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ కనిపించబోతున్నాడు. మొట్టమొదటిసారి తెలుగుతెరపై మైక్ టైసన్ లైగర్ లో నటిస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ మధ్య వచ్చే సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

అమెరికాలో మొదలైన ఈ షూట్ కి సంబంధిన ఒక ఫోటోను విజయ్ దేవరకొండ అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలో విజయ్ – టైసన్ నవ్వులు చిందిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ చిత్రం రౌడీ హీరో రేంజ్ ని ఏ రేంజ్ కి మార్చనుందో చూడాలి.

Related Articles

Latest Articles