హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో టైమింగ్స్ పెంపు

హైదరాబాద్‌ మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. ఇవాళ్టి నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. నేటి నుంచి రాత్రి వేళల్లో 10 గంటల 15 నిమిషాలకు చివరి మెట్రో సర్వీసు ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు రాత్రి 9 గంటల 45 నిమిషాల వరకు చివరి మెట్రో రైలు సర్వీసులు నడిచేవన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైళ్ల సమయాలను పొడిగించినట్లు వెల్లడించారు. ఇక మెట్రో తీసుకున్న తాజా నిర్ణయం తో ప్రయాణికులకు చాలా ఊరట కలుగనుంది. కాగా… కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ సమయం లో… హైదరాబాద్ మెట్రో రైళ్లు రద్దైన సంగతి తెలిసిందే.

Related Articles

Latest Articles

-Advertisement-