ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీకి సభ్యుల నియామకం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటికి సభ్యులను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ పోలీసు కంప్లైంట్స్ అథారిటీకి 3 సభ్యులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ ఐపీఎస్ కె.వి.వి.గోపాలరావు, రిటైర్డ్ ఐఎఎస్సులు బి.కిషోర్, ఉదయ లక్ష్మిని సభ్యులుగా నియమించింది. పోలీసు కంప్లైట్స్ అథారిటీ సభ్యుల కాల వ్యవధి మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఉంటుందని తెలిపింది. జిల్లా స్థాయిలోనూ చైర్మన్లు, సభ్యులన నియమించింది.

మూడేసి జిల్లాలకు ఒక చైర్మన్, ఇద్దరేసి సభ్యుల్ని నియమించిన ప్రభుత్వం… ఉత్తరాంధ్ర జిల్లాలకు ఛైర్మనుగా రిటైర్డ్ జిల్లా అదనపు న్యాయమూర్తి అనింగి వరప్రసాద రావు… ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు రిటైర్డ్ జిల్లా జడ్జి ఆర్జే విశ్వనాథం… గుంటూరు,ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రిటైర్డ్ అదనపు జిల్లా న్యాయమూర్తి నేతల రమేష్ బాబు… కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు రిటైర్డ్ జిల్లా జడ్జ్ కుప్పం వెంకట రమణా రెడ్డిని నియమించింది ప్రభుత్వం. ఇక జిల్లాల కమిటీల సభ్యులుగా విశ్రాంత డీఎస్పీలు, విశ్రాంత పాలనాధికారులు ఉండనున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-