పిక్ : లేడీ సూపర్‌స్టార్‌ తో ‘ఎఫ్-3’ బ్యూటీ ఫన్

సౌత్‌ లేడీ సూపర్‌స్టార్‌ నయనతార దుబాయ్‌లో విఘ్నేష్‌ శివన్‌తో సరదాగా గడుపుతోంది. ఈ జంట కొత్త సంవత్సరాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు అందమైన నగరంలో క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తున్నారు. ఈ జంట దుబాయ్‌లో సరదాగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా లేడీ సూపర్ స్టార్ నయన్ తో ‘ఎఫ్-3’ బ్యూటీ మెహ్రీన్ పిక్ ట్రెండ్ అవుతోంది.

Read also : “పుష్ప”రాజ్ కోసం అమెజాన్ ఎంత చెల్లించిందో తెలుసా?

ఇటీవల నయన్, విఘ్నేష్ దుబాయ్‌లో షాపింగ్‌కి వెళ్లినప్పుడు వారికి మెహ్రీన్ పిర్జాదా తారసపడింది. ఇద్దరు కలిసి పోజులిచ్చిన ఫోటోను షేర్ చేస్తూ మెహ్రీన్ పిర్జాదా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో “చివరికి లేడీ సూపర్‌స్టార్ నయనతారను కలవడం చాలా బాగుంది” అంటూ రాసుకొచ్చింది. మెహ్రీన్ ఫ్యాన్ గర్ల్ మూమెంట్‌ను విఘ్నేష్ క్లిక్ చేసారు. దుబాయ్ లో ఈ ముగ్గురూ కలిసి టైం స్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పిక్ లో నయన్ ఎరుపు రంగు పోల్కా చుక్కల స్కర్ట్‌లో అందంగా కనిపించగా, మెహ్రీన్ హూడీ, డెనిమ్ స్కర్ట్‌లో సూపర్ గా కనిపిస్తోంది.

ఇక సినిమాల విషయానికొస్తే… మెహ్రీన్ పిర్జాదా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో F3 షూటింగ్‌లో ఉంది. ఈ చిత్రం 2022 ఏప్రిల్ 29న విడుదల కానుంది. మరోవైపు నయనతారకు తెలుగులో గాడ్ ఫాదర్, షారుఖ్ అండ్ అట్లీల బాలీవుడ్ చిత్రం, ఒక మలయాళం, రెండు తమిళ చిత్రాలు చేతిలో ఉన్నాయి.

Related Articles

Latest Articles