‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’.. మొక్కలు నాటిన హీరోయిన్ మెహ్రీన్‌

రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్‌ ఫిర్జాదా కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. గురువారం రామానాయుడు స్టూడియోలో మొక్కలు నాటి ఛాలెంజ్ ని పూర్తిచేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ” పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు ఎంతో అవసరం .. ఇలాంటి మంచి కార్యక్రమంలో భాగమవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.. నన్ను ఈ కార్యక్రమంలో భాగం చేసిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.. రాబోయే తరాలకు ఆక్సిజన్ అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని” మెహ్రీన్‌ తెలిపింది. అంతేకాకుండా తన ఆహ్వానాన్ని మన్నించి తన ఫ్యాన్స్ అందరూ మొక్కలు నాటాల్సిందిగా కోరింది. కార్యక్రమం అనంతరం మెహ్రీన్‌కు గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని అందించారు.

Related Articles

Latest Articles