‘మిర్చి’ ఘాటు చూపించిన మెహబూబ్

తెలుగు బిగ్ బాస్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు మెహబూబ్. యూట్యూబ్ స్టార్ గా అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మెహబూబ్ బిగ్ బాస్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక బిగ్ బాస్ తర్వాత మెహబూబ్ ఫుల్ బిజీ అయ్యాడు. వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో భాగంగా ‘గుంటూరు మిర్చి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ విడుదలైంది.

Read Also : ఒకసారి పెళ్లయ్యాక కూడా నీకు బుద్ధి రాలేదా ?

ఈ టీజర్ సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో అందరిని ఆకట్టుకుంటోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ తో చిందేశాడు మెహబూబ్. గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని టీజర్ ఇచ్చిందనే చెప్పాలి. మరి మెహబూబ్ ఈ సినిమా తో హీరోగా బిజీ అవుతాడా? ‘గుంటూరు మిర్చి’గా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతాడా అన్నది తేలాల్సి ఉంది. లెట్స్ వెయిట్.

Related Articles

Latest Articles

-Advertisement-