మేఘాలయ గవర్నర్‌కు లీగల్‌ నోటీసులు

మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌కు ఊహించని షాక్‌ తగిలింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన PDP అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ రోష్నీ పథకం విషయంలో తప్పుడు ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారన్నారు. నెల రోజల్లో రూ.10 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ డబ్బును వ్యక్తిగత ప్రయోజనాలకు ఖర్చు చేయమని, ప్రజా శ్రేయస్సు కోసం ఖర్చుపెడతామని తెలిపారు.గతంలో సత్యపాల్‌ మాలిక్‌ జమ్ము కాశ్మీర్‌కు గవర్నర్‌గా పనిచేశారు. ఆ సమయంలో రోష్నీ పథకంపై తప్పుడు ఆరోపణలు చేసినట్టు మహబూబాముఫ్తీ పేర్కొన్నారు.

Related Articles

Latest Articles