కంఫర్ట్ జోన్ లో ఉండే క్యారెక్టర్స్ మానేశా: మేఘా ఆకాష్

క్యూట్ గర్ల్ మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’.. సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల హీరోలుగా నటించారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న సంద‌ర్భంగా మేఘా ఆకాష్ ఇంటర్వ్యూలో ప‌లు విష‌యాలు తెలియ‌జేసింది.

‘డియర్ మేఘ లాంటి కంప్లీట్ రొమాంటిక్ ఫిల్మ్ లో నేను ఇప్పటిదాకా నటించలేదు. ఈ సినిమాలోని క్యారెక్టర్ కు నాకు వ్యక్తిగతంగా కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ సినిమాలో అన్ కండిషనల్ లవ్ అంటే ఎలా ఉంటుందో చూస్తారు. అబ్బాయి, అమ్మాయి కలవడమే ప్రేమ కాదు. ఎన్నో రకాల ప్రేమలుంటాయి. మా చిత్రంలో జెన్యూన్ లవ్ ను ప్రేక్షకులు ఫీల్ అవుతారు.

పెళ్లి విషయమై మాట్లాడుతూ.. నేను ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. నన్ను నాలా ఉండనిచ్చే హస్బెండ్ దొరికితే చాలు.. నేను సినిమా పరిశ్రమలోకి వచ్చిన మొదట్లో నా కంఫర్ట్ జోన్ లో ఉండే క్యారెక్టర్స్, సినిమాల్లో నటించాను. కానీ ఇప్పుడు నా ఆలోచనా విధానం మారిపోయింది. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి సినిమాలు ఎంచుకుంటున్నాను. ఇకపైనా అలాగే కంటిన్యూ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. మేఘా ఆకాష్ రీసెంట్ విడుదలైన ‘రాజ రాజ చోర’ సినిమాలోనూ నటించిన విషయం తెలిసిందే.

-Advertisement-కంఫర్ట్ జోన్ లో ఉండే క్యారెక్టర్స్ మానేశా: మేఘా ఆకాష్

Related Articles

Latest Articles