‘సీటీమార్’ ట్రైలర్ కు మెగాస్టార్ ఫిదా!

చిత్రసీమలోని నవతరాన్ని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఇక ఓ థాట్ ప్రోవోకింగ్ మూవీస్ తీసే దర్శకులను అప్రిషియేట్ చేయడంలో మరింత ముందుంటారు. వినాయక చవితి కానుకగా ఈ నెల 10న రాబోతున్న ‘సీటీమార్’ సినిమా విడుదలకు ముందే, దాని ట్రైలర్ ను చూసి మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు సంపత్ నందితో పాటు ఆ చిత్ర బృంధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల చిరంజీవి ఇంటికి వెళ్ళి సంపత్ నంది ‘సీటీమార్’ ట్రైలర్ ను చూపించారు. దాన్ని చూసి ఫిదా అయిన చిరంజీవి మూవీ మేకింగ్ కి సంబంధించిన విశేషాలను కూడా అడిగి తెలుసుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా థీమ్, దీన్ని తెర కెక్కించిన తీరును అభినందించారు.

Read Also : కంగనాను “తలైవి”లో నటించ వద్దని చెప్పాను : విజయేంద్ర ప్రసాద్

కబడ్డీ నేపథ్యంలో ‘సీటీమార్’ మూవీని రూపుదిద్దుకోవడం అభినందించదగ్గ విషయమని, మరీ ముఖ్యంగా మహిళా కబడ్డీ పై తీయడం, దాని కోసం కొంతమంది మహిళలకు స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం మంచి పని అని అభిప్రాయపడ్డారు. హీరోహీరోయిన్లుగా నటించిన గోపీచంద్, తమన్నాను, సంగీతాన్ని సమకూర్చిన మణిశర్మను అప్రిషియేట్ చేశారు. ఈ సినిమా ఘన విజయం సాధించి, మరింత మందికి స్ఫూర్తిని ఇవ్వాలనే ఆకాంక్షను చిరంజీవి వ్యక్తం చేశారు. ఇటీవల టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లోనూ మహిళలు వివిధ విభాగాలలో ప్రతిభను చాటి దేశానికి విశేష ఖ్యాతిని తెచ్చిపెట్టిన సంగతిని తెలియచేస్తూ, పీవీ సింధును తాను సత్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. విశేషం ఏమంటే… చిరు తనయుడు రామ్ చరణ్ హీరోగా గతంలో సంపత్ నంది ‘రచ్చ’ మూవీని డైరెక్ట్ చేశాడు. అప్పటి నుండి మెగా ఫ్యామిలీతో అతని అనుబంధం అలానే కొనసాగుతోంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-