‘రావణాసుర’ కోసం వస్తున్న మెగాస్టార్..

మాస్ మహారాజ రవితేజ- సుధీర్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన మేకర్స్ సంక్రాంతి పర్వదినాన ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకురానున్నారు. జనవరి 14న ఈ సినిమా పూజ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇక ఈ పూజకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. “కొత్త సంవత్సరం మెగా ఆరంభం.. ఇంతకంటే సంక్రాంతి కానుక మేము అడగలేదు. పూజా కార్యక్రమానికి మీరు హాజరుకావడం మా అదృష్టం చిరంజీవి గారు.. ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో సుశాంత్ ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ పది గెటప్పులో కనిపించనున్నాడట. మరి ఈ సినిమాతో ఫేడ్ అవుట్ అయిన సుధీర్ వర్మ మళ్లీ హిట్ ట్రాక్ లోకి వస్తాడా..? లేదా..? అనేది చూడాలి.

Related Articles

Latest Articles