ఆలస్యంగా రానున్న అన్నయ్య.. ఆచార్య సినిమా వాయిదా..

మెగాస్టార్‌ కథనాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎప్పుడెప్పుడూ ఆచార్య సినిమా విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు నిరాశే మిగిలింది. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఇప్పటికే భారీ బడ్జెట్‌ సినిమాలు వాయిదాపడ్డాయి. రామచరణ్‌, ఎన్టీఆర్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ లాంటి పాన్‌ఇండియా సినిమాలు సైతం కరోనా దెబ్బకు యూటర్న్‌ తీసుకున్నాయి.

ఆచార్య సినిమా విషయానికి వస్తే.. ఫిబ్రవరి 4న ఆచార్య సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అంతేకాకుండా చిత్రయూనిట్‌ సినిమా విడుదలకు అన్ని సన్నాహాలు కూడా చేసింది. అయితే అనుకోకుండా కరోనా కేసులు పెరగడం, ఏపీలో ఈ నెల 18 నుంచి నైట్‌ కర్ఫ్యూ విధించడం లాంటి పరిణామాలతో ఆచార్య సినిమాను సైతం వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్రయూనిట్‌ తెలిపింది.

Related Articles

Latest Articles