అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదు: చిరంజీవి

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో ఆదివారం రాత్రి మృతిచెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా శివశంకర్ మాస్టర్ మృతి పట్ల స్పందించారు. శివశంకర్ మాస్టర్ మృతి నన్ను కలిచివేసిందని… ఆయన మరణం కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. శివశంకర్ మాస్టర్‌తో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.

Read Also: బహుముఖ ప్రజ్ఞాశాలి.. శివశంకర్ మాస్టర్

ఖైదీ సినిమాకు సలీం మాస్టర్ అసిస్టెంట్‌గా శివశంకర్ మాస్టర్ తనకు స్టెప్పులు కంపోజ్ చేశారని చిరు వెల్లడించారు. తమ ఇద్దరి మధ్య అప్పుడు మొదలైన స్నేహం.. ఇప్పటివరకు కొనసాగుతోందన్నారు. శివశంకర్ మాస్టర్, తాను ఎన్నో సినిమాలకు కలిసి పనిచేశామని… ఆయన్ను చివరగా ఆచార్య సినిమా సెట్స్‌లో కలిశానని చిరు తెలిపారు. అయితే అదే చివరిసారి అవుతుందని అస్సలు ఊహించలేదని.. తనకు ఓ ఆత్మీయుడిని కోల్పోయినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles