చిరంజీవి చేతుల మీదుగా ‘క్లాప్’ టీజర్

ఆది పినిశెట్టి అథ్లెట్ గా నటిస్తున్న ‘క్లాప్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన స్నేహితుడైన రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది నటించిన ద్విభాషా చిత్రం ‘క్లాప్’ టీజర రిలీజ్ చేయటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. బహుభాషా నటుడైన ఆదిని తమ కుటుంబ సభ్యునిగా భావిస్తామని, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు ఏవీ నిరాశపరలేదని అలాగే ఆది నటించిన ఈ స్పోర్ట్స్ సినిమా కూడా అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. ఆది పోషించిన ఛాలెంజింగ్ పాత్రలో ఉన్న ట్విస్ట్ మెప్పిస్తుందన్నారు.

రామాంజనేయులు జువ్వాజి, కార్తికేయ, రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను సర్వంత్ రామ్ క్రియేషన్స్ పై నిర్మితం అయింది. ఆకాంక్ష సింగ్ ఇందులో హీరోయిన్ గా నటించారు. పృథ్వీ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తన కలలు నెరవేర్చుకునే క్రమంలో ఎవరి మద్దతు లభించని ఓ యవ స్ప్రింటర్ యువతకు ఎలా స్ఫూర్తిగా నిలుస్తాడన్నదే ఈ చిత్రం కథాంశం. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం పెద్ద ఎస్సెట్ గా నిలుస్తుందంటున్నారు నిర్మాతల్లో ఒకరైన రామాంజనేయులు. త్వరలోనే ట్రైలర్ తో పాటు ఆడియోను విడుదల చేసి ఆ తర్వాత సినిమాను రిలీజ్ చేస్తామంటున్నారాయన.

చిరంజీవి చేతుల మీదుగా 'క్లాప్' టీజర్

Related Articles

Latest Articles

-Advertisement-