ఖ‌రీదైన కారు కొనుగోలు చేసిన చ‌ర‌ణ్‌.. ప్రత్యేకమైన డిజైన్‌

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో న్యూ బ్రాండ్‌ బెంజ్‌ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఇటీవలే కొన్న ఈ కారు చరణ్ ఇంటికి డెలివరీ అయ్యింది. అత్యంత ఖరీదైన ఈ కారును చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. అయితే చరణ్ దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉండగా.. ‘మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్‌ 600’ సరికొత్త కారు కూడా ఆయన షెడ్డులోకి వచ్చి చేరింది. ఈ కారు డెలివరీకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారును అందించిన కంపెనీ సిబ్బందితో ఈ సంద‌ర్భంగా ఫొటోలు దిగారు. అధునాతన టెక్నాలజీతో కలిగిన ఈ కారును చరణ్ డ్రైవ్ చేస్తూ కనిపించారు.

ఈ కారు ధర రూ. 2.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్ కలర్ లో వున్నా ఈ లగ్జరీ కారు చూడ్డానికి ఆకర్షణీయంగా వుంది. హై సెక్యూరిటీ, లేటెస్ట్ టెక్నాలజీతో అత్యంత సౌకర్యవంతంగా వుండనుందట. ఇక ఇటివలే చరణ్ మిత్రుడు, ఆర్ఆర్ఆర్ కో-స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా లగ్జరీ కారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.. వీరిద్దరూ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం దసరాకు రావాల్సి ఉండగా.. గ్రాఫిక్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. ఇక చరణ్-శంకర్ సినిమా ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకొంది. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

Image
Image
2021 | BRAND NEW | MERCEDES MAYBACH GLS 600 | FULL BLACK | dubizzle

Related Articles

Latest Articles

-Advertisement-