“భీమ్లా నాయక్”కు ఫ్యామిలీ స్టార్స్ విషెస్

ఈ రోజు పవన్ కళ్యాణ్ 50 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులు “పవనోత్సవం” అంటూ ఘనంగా జరుపుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు శుభాభినందనలు వెల్లువెత్తుతుంటే ఆయన కుటుంబ సభ్యులు, మెగా హీరోలు కూడా పవన్ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ విష్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా పవన్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ అభిమానుల్లో జోష్ నింపింది. ఈ క్రమంలో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ వంటి మెగా హీరోలు వరుసగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బన్నీ ట్వీట్ మెగా అభిమానులకు చాలా సంతోషాన్ని కలిగించింది. బన్నీ పవన్‌ను సంతోషంగా కౌగిలించుకున్నట్లుగా బన్నీ పోస్ట్ చేసిన స్నాప్ కూడా వైరల్ అవుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-