మెగా భోగీ సెలబ్రేషన్స్ : వరుణ్ని చూసి కుళ్లుకున్న చిరు.. ఎంత పని చేశాడు

దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. నేడు భోగీ కావడంతో ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో కలిసి భోగీ మంటలు వేసి కొత్త యేడాదిని ఆహ్వానిస్తున్నారు. ఇక సామాన్యులతో పాటు సెలబ్రెటీలు సైతం ఉదయాన్నే లేచి భోగీ మంటల వేడుకల్లో పాల్గొని అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీలో భోగీ సెలబ్రేషన్స్ వినోదంగా జరిగినట్లు తెలుస్తోంది. ఏ పండగ వచ్చినా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి రచ్చ స్టార్ట్ చేయడం తెలిసిందే. ఇక ఈసారి కుర్రాళ్లతో కలిసి చిరు కూడా హంగామా చేశారు. ఉదయాన్నే భోగిమంటలు వేసి, అనంతరం ఇంట్లోవారికి ఎంచక్కా దోశలు వేసి పెట్టారు.

ఇక వంట చేసేటప్పుడు వరుణ్ తో కలిసి చిరు చేసిన అల్లరి పని నవ్వులు పోయిస్తుంది. ఇద్దరు రెండు స్టవ్ లు వెలిగించి.. పెనంపై రెండు దోశలు పోశారు.. వరుణ్ దోశ బాగా రాగా .. చిరు దోశ సరిగ్గా రాలేదు. దీంతో వెంటనే చిరు, వరుణ్ దోశను చెడగొడుతూ వార్న్ దోశ బాగా వచ్చింది.. నాకు కుళ్లు వచ్చేసింది.. చెడగొట్టేయాలి అంటూ దోశను చిందరవందర చేసి ఉప్మా చేశాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక దీంతో వరుణ్ షాక్ అవ్వుతూ నవ్వడం మొదలుపెట్టాడు. ఈ వీడియోలో చిరు తల్లి అంజనా దేవి, నాగబాబు దంపతులు, మెగా ప్రిన్సెస్ నిహారిక, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కనిపించారు. ఈ వీడియోను వరుణ్ తేజ్ ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ “బాస్ చిరంజీవితో దోస మేకింగ్ 101.. 2022 భోగి” .. అందరికి భోగీ శుభాకాంక్షలు అని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles