మేడిగ‌డ్డ బ్యారేజీ 15గేట్లు ఎత్తి వేత‌

మేడిగ‌డ్డ బ్యారేజ్ 15 గేట్లు ఎత్తివేసి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు అధికారులు.. మ‌హారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కార‌ణంగా.. బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు మ‌హారాష్ట్ర అధికారులు.. దీంతో.. దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీకి దాదాపు 53 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో వ‌చ్చి చేరుతోంది.. దీంతో ఈ రోజు ఉదయం బ్యారేజీ 15 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. 15 గేట్ల ద్వారా 31,100 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.. కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి అన్నారం బ్యారేజీకి 4,200 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేస్తున్న‌ట్టు అధికారులు చెబుతున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-