శోకసంద్రంలో మేడారం.. ప్రముఖ పూజారి మృతి

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఈ వైరస్ పేదవాళ్ళను కూడా వదలడం లేదు. అయితే తాజాగా ప్రసిద్ది గాంచిన మేడారంకు కరోనా సెగ తగిలింది. ములుగు జిల్లాలో మేడారం సమ్మక్క తల్లి పూజారి అయిన సిద్దబోయిన సమ్మారావు మృతి చెందారు. దీంతో మేడారం శోకసంద్రంలోకి వెళ్ళింది. వివరాల్లోకి వెళితే… పూజారి సమ్మారావుకు ఒక నెల క్రితం కరోనా సోకింది. అయితే… మెరుగైన వైద్యం తీసుకున్న పూజారి… త్వరగానే కరోనా నుంచి కోలుకున్నాడు. అలా కరోనా నుంచి కోలుకున్నాడో… లేదో… అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరాడు పూజారి. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో… తాజాగా ఆ పూజారి తుదిశ్వాస విడిచారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే… కొద్ది రోజుల క్రితమే సమ్మారావు భార్య సృజన కరోనాతో మృతి చెందింది. తాజాగా సమ్మారావు కూడా చనిపోవడం ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. సమ్మారావు కూడా కరోనాతో మృతి చెందినట్లు స్థానికులు అంటున్నారు. సమ్మారావుకు ఒక బాబు, ఒక పాప కలరు. తల్లి దండ్రులు ఇద్దరు చనిపోవడం తో… ఆ ఇద్దరు పిల్లల జీవితం దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేయబడింది. ఆ పిల్లలను ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-