“లవ్ స్టోరీ”కి నిరాశ తప్పదా ?

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది.

ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 10న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో థియేటర్లు ఇప్పటికీ 50% ఆక్యుపెన్సీతో నడవడం, టికెట్ రేట్ల విషయమై ముఖ్యమంత్రి జగన్ తో సినిమా పెద్దల సమావేశం జరగాల్సి ఉంది. దీంతో ఈ భేటీ కారణంగా సినిమాను సెప్టెంబర్ 24కు వాయిదా వేశారు. అప్పటిలోపు ఈ సమావేశం జరిగి సీఎం జగన్ టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇస్తే అది సినిమాకు ప్లస్ అవుతుందని భావించారు. కానీ పరిస్థితి చూస్తే “లవ్ స్టోరీ” టీంకు నిరాశ తప్పేలా కన్పించడం లేదు.

Read also : “భీమ్లా నాయక్” అప్డేట్… ఈరోజే ఆ సర్ప్రైజ్

జగన్ తో పెద్దల మీటింగ్ పోస్ట్ పోన్ అవుతూ అక్టోబర్ మొదటి వారం వరకూ వచ్చింది. మరోవైపు “లవ్ స్టోరీ”ని సెప్టెంబర్ 24కు విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. పైగా అదే రోజు నుంచి ఆంధ్రాలో 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు ఓపెన్ అవుతాయనే వార్తలు కూడా విన్పించాయి. కాగా ఇప్పటికే ఈ సినిమాను రెండుసార్లు వాయిదా వేశారు. అందుకే మరోసారి వాయిదా వేసే సాహసం చేయడం లేదు మేకర్స్. ఆంధ్రప్రదేశ్ లో అప్పటికి పరిస్థితి ఎలా ఉన్నా విడుదల చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఇక ఏపీలో 50% ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ కంటెంట్ బాగుండడంతో ఇటీవల విడుదలైన “సీటిమార్”కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ధైర్యంతో “లవ్ స్టోరీ” టీం కూడా సినిమాను విడుదల చేయబోతోంది.

ఇక “లవ్ స్టోరీ” టీం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణలో ఎలాంటి ఆంక్షలు లేవు. మాగ్జిమమ్ టికెట్ రేట్లతో 100% ఆక్యుపెన్సీతో కావాల్సినన్ని షోలను వేసుకోవడానికి అనుమతి ఉంది. సింగిల్ స్క్రీన్ లలో రూ.150, మల్టీప్లెక్స్ లలో రూ.200 గా టికెట్ రేట్ నిర్ణయించారు. మరి టాలీవుడ్ మొత్తం ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

-Advertisement-"లవ్ స్టోరీ"కి నిరాశ తప్పదా ?

Related Articles

Latest Articles