బ్రేకింగ్‌: రెండు వాహనాలకు నిప్పు.. పోలీసులకు మావోయిస్టుల సవాల్

ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఏటూరునాగారం మండలం రొయ్యూరు దగ్గర తారు రోడ్డు వేస్తున్న రెండు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసిరారు. ఘటనా స్థలంలో PLGA వారోత్సవాలు విజయవంతం చేయాలని కరపత్రం వదిలి వెళ్ళారు మావోయిస్టులు. మావోయిస్టుల PLGA వారోత్సవాల సందర్భంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటూరునాగారం పీఎస్ కు 15 కిమీ దూరంలో వాహనాలు ధ్వంసం చేసి పోలీసులకు సవాల్ విసిరారు మావోయిస్టులు. ఇటీవల భారీ ఎన్ కౌంటర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టులు ఇంతకుముందే హెచ్చరించారు.

Related Articles

Latest Articles