చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన భారీ భూకుంభకోణం…

చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణం వెలుగు చూసింది. నకిలీ పత్రాలు సృష్టించి 500 కోట్లకు పైగా విలువ కలిగిన భూములు కాజేసే ప్రయత్నం చేసారు. జిల్లాలోని 13 మండలాల్లో జరిగిన ఈ భూ కుంభకోణం జరిగింది. అయితే మొత్తం 93 సర్వే నెంబర్లలో ఉన్న 2,320ఎకరాల స్థలం పేర్ల మార్పు చేసారు. ఒకే రోజు ఆన్ లైన్ లో జరిగిపోయింది ఈ భూ దందా. ఈ కేసులో విఆర్వో మోహన్ పిళ్ళై ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఆన్లైన్లో తమ కుటుంబీకుల పేరిట భూములను బదలాయింపు చేసారు వీఆర్వో మోహన్ పిళ్ళై. పలు ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగి విచారణ జరిపింది సిఐడి. ప్రధాన నిందితుడు మోహన్ గణేష్ పిళ్ళెతో పాటు మధుసూదన్, రాజన్, కోమల, రమణను అదుపులోకి తీసుకుంది సిఐడి. నిందితులందరూ ఒకే కుటుంబ సభ్యులు. ప్రస్తుతం మరో నిందితురాల ధరణి పరారీలో ఉంది. నిందితుల నుంచి 40నకిలీ పత్రాల స్వాధీనం చేసుకున్నారు. నిన్న అందరిని అరెస్టు చేసి స్కామ్ వివరాలు మీడియాకు వెల్లడించారు సిఐడి డిఎస్పి రవి కుమార్.

-Advertisement-చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన భారీ భూకుంభకోణం...

Related Articles

Latest Articles