13 అంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం.. 46 మంది మృతి

తైవాన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.. కౌహ్సియుంగ్‌ లో ఇవాళ ఉదయం 13 అంతస్తుల భవనంపై మంటలు చెలరేగాయి.. అవి క్రమంగా బిల్డింగ్‌ మొత్తం వ్యాప్తించాయి.. ఈ ఘటనలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు.. మరో 41 మంది తీవ్రగాయాలపాలయ్యారు.. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు అధికారులు..

కౌహ్సియుంగ్‌లో ఉన్న ఆ భవాన్ని 40 సంవత్సరాల క్రితం నిర్మించారు.. గురువారం వేకువజామున మంటలు చెలరేగాయి.. అవి క్రమంగా భవనం మొత్తం వ్యాప్తించాయి.. ఘటనా స్థలానికి చేరుకున్న మంటలు అదుపులోకి తీసుకురావడం అగ్నిమాపక సిబ్బందికి సవాల్‌గా మారింది.. ఈ ఘటనలో పలు అంతస్తులు ధ్వంసమయ్యాయి.. ఆ తర్వాత మాత్రమే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.. అగ్నిమాపక విభాగం ప్రకారం, భవనంలో 46 మంది మరణించినట్టు నిర్ధారించారు.. ఆ అపార్ట్‌మెంట్‌లో ప్రజలు నివాసం ఉంటున్న 7 నుండి 11 అంతస్తులలో చాలా మంది మరణించారని అధికారులు ప్రకటించారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక శాఖ 70కి పైగా ట్రక్కులను మోహరించింది.. ఇది మల్టీపరప్సస్‌ బిల్డింగ్.. గతంలో, ఈ భవనంలో రెస్టారెంట్లు, కచేరీ లాంజ్‌లు, సినిమా స్క్రీన్లు కూడా ఉన్నాయి.. అధికారుల ప్రకారం ఇప్పటికీ మొదటి ఐదు అంతస్తులు వాణిజ్యపరమైన ఉపయోగం కోసం ఉద్దేశించినవి.. కానీ అవి ఖాళీగా ఉన్నాయని చెబుతున్నారు.

-Advertisement-13 అంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం.. 46 మంది మృతి

Related Articles

Latest Articles