వాహనదారులకు షాకింగ్ న్యూస్ చెప్పిన మారుతి సుజుకి

ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వాహనదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై తాము డీజిల్ కార్లను తయారుచేసేది లేదని ప్రకటించింది. 2023 తర్వాత దేశంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయని.. దీంతో డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గిపోతాయని కంపెనీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మారుతి సుజుకి అధికారికంగా తెలిపింది. కర్బన ఉద్గారాల నియంత్రణ నిబంధనలను పాటిస్తూ డీజిల్ కార్ల తయారీని నిర్వహించడంతో ఖర్చు అధికంగా పెరుగుతుందని మారుతీ సుజుకి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సీవీ రామన్ వెల్లడించారు.

Read Also: రైలుకు ఎదురుగా నిలబడి యువకుడి ఆత్మహత్య

దేశంలో 2013-14 నుంచి డీజిల్ కార్ల విక్రయాలు తగ్గిపోయాయని… ప్రస్తుతం దేశంలోని మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో డీజిల్ కార్లు 17 శాతం మాత్రమే ఉన్నాయని మారుతి సుజుకి ప్రకటించింది. అంతకుముందు కార్ల విక్రయాలలో 60 శాతం అమ్మకాలు డీజిల్ కార్లవే ఉండేవని… ప్రస్తుతం పెట్రోల్ కార్లలో మైలేజీ సామర్థ్యం పెరిగిందని పేర్కొంది. మరోవైపు తక్కువ ఖర్చుతో తయారయ్యే సీఎన్‌జీ కార్లపై తాము దృష్టి పెడుతున్నామని మారుతి సుజుకి వెల్లడించింది.

Related Articles

Latest Articles