దీపావళికి ‘మంచి రోజులు వచ్చాయి’!

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. మారుతీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌, సోసోగా ఉన్నా. ఎక్కేసిందే పాటలకు అద్భుతమైన స్పందన వచ్చిందని మారుతీ అన్నారు. విడుదలతేదీని ఖరారు చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ‘మహానుభావుడు’ మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో మరోసారి మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఇందులో హీరోయిన్ గా నటించింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి సంతోష్ శోభన్ జోడీ కట్టాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మరి దీపావళి బరిలో ఇప్పటికే ‘రొమాంటిక్’ చిత్రమూ నిలిచి ఉంది. మరి ఈ రెండు ప్రేమకథా చిత్రాలలో దేనివైపు ప్రేక్షకులు మొగ్గుచూపుతారో చూడాలి.

దీపావళికి ‘మంచి రోజులు వచ్చాయి’!
-Advertisement-దీపావళికి ‘మంచి రోజులు వచ్చాయి’!

Related Articles

Latest Articles