త‌నీష్ సినిమా రిలీజ్ ఫిక్స్.. ఆ తేదీన రిలీజ్ అవుతుందా?

టాలీవుడ్ యంగ్ హీరో తనీష్ తాజాగా నటించిన సినిమా మరో ప్రస్థానం. ఈ సినిమాలో ముస్కాన్ సేథీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం సింగిల్ షాట్ ప్యాటర్న్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ ప్యాటర్న్‌లో తెలుగులో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ‘మరో ప్రస్థానం’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విగడుదలవుతుందా అని వేచి చూస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం తెలుగు ప్రేక్షులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులు నెరవేరే సమయం వచ్చేసింది.  సినిమా పోస్ట‌ర్ తో పాటు ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకునే విధంగా ఉండంతో సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగాయి.  దానికి త‌గ్గ‌ట్టుగానే సినిమాకు బిబినెస్‌కూడా జ‌రుగుతున్న‌ది.  భారీగా వ‌స్తున్న క్రేజ్ దృష్ట్యా సినిమాను ఈ నెల 24 వ తేదీన రిలీజ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్టుగా స‌మాచారం.  మంచి ఫీల్ ఉన్న క‌థ‌, గ‌తంలో ఎప్ప‌డూ చేయ‌ని ఓ కొత్త పాయింట్‌ను ట‌చ్ చేస్తూ తీసిన సినిమా కావ‌డంతో దీనిపై బ‌ల‌మైన న‌మ్మ‌కం ఏర్ప‌డింది.  జానీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోయిన్ భానుశ్రీ మోహ్ర త‌నీష్‌కు జోడిగా న‌టిస్తోంది.  

Related Articles

Latest Articles

-Advertisement-