‘మరక్కార్.. అరేబియా సముద్ర సింహం’ వచ్చేది అప్పుడే..

మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మరక్కార్.. అరేబియా సముద్ర సింహం’. మలయాళ దర్శకుడు దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎంతోమంది అగ్రతారలు నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, మంజు వారియర్, సుహాసిని, కళ్యాణి ప్రియదర్శిని, కీర్తి సురేష్, సిద్ధిఖ్, సురేశ్ కృష్ణ , ప్రణయ్ మోహన్ లాల్ తదితరులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కరోనాకు ముందే విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు డిసెంబర్ 2న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 15వ శతాబ్దంలో కేరళ నావీఆఫీసర్ గా చేసిన కుంజాలీ మరక్కార్ జీవిత కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మరి ఈ సినిమాతో మోహన్ లాల్ మరోసారి హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.

Related Articles

Latest Articles