స‌మాజంలోని మ‌కిలిని తొల‌గించమ‌నే చిత్రం!

అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలంటే, తప్పుచేసినవారిని శిక్షించడం కాదు, తప్పుచెయ్యాలనే ఆలోచనలను చంపాలి. మకిలి పట్టిన ఈ సమాజాన్నిరక్తంతో కడగాలి అనే సందేశంతో రూపుదిద్దుకున్న సినిమా మ‌కిలి. అయాన్, అక్స్తా ఖాన్, కాంచ‌న హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాలో ధన్ రాజ్, విజయభాస్కర్, నూకరాజు, ఆనంద్, డీవీ నాయుడు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. బాలు ప్ర‌సాద్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీని శ్రీనివాస‌రావు బొజ్జ నిర్మించారు. ఈ నెల 18నుండి ఈ సినిమా ఊర్వ‌శీ ఏటీటీలో ల‌భ్య‌మౌతుంద‌ని, రూ. 49 చెల్లించి, దీనిని చూడొచ్చ‌ని నిర్మాత శ్రీనివాస‌రావు తెలిపారు. నంద క‌ర్రి ఈ చిత్రానికి సంగీతం అందించ‌గా, ఎం. నాగేంద్ర కుమార్ సినిమాటోగ్రాఫ‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-