ములుగు జిల్లాలో పోస్టర్ల కలకలం

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. కొండాపూర్- ఆలుబాక గ్రామాల మధ్య పట్టపగలు మావోయిస్టులు గోడపత్రికలు విడిచిపెట్టారు. వెంకటాపురం – వాజేడు ఏరియా కమిటీ పేరు మీదుగా పోస్టర్లు వెలిశాయి. మావోయిస్టు ఇన్ఫార్మర్లను హెచ్చరిస్తూ పోస్టర్లు ముద్రించారు.
బొల్లారం, సీతారాంపురం, కలిపాక గ్రామాలకు చెందిన కొంతమంది పేర్లు ప్రకటించారు. తమ గురించి పోలీస్ లకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని మావోయిస్ట్ పార్టీ నష్టానికి సహకరిస్తున్నారు అని పోస్టర్లో పేర్కొన్న మావోలు. ఇన్ఫార్లకు హెచ్చరికలు జారీచేయడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. పోలీసుల ప్రలోభాలకు లొంగవద్దని హెచ్చరించారు.

Related Articles

Latest Articles