కరోనాతో మావోయిస్టు కీలక నేత మృతి..

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు.. ఎక్కడి నుంచి.. ఎప్పుడు.. ఎలా.. ఎటాక్‌ చేస్తుందో కూడా తెలియని పరిస్థితి… జనారణ్యంలో ఉండే వారినే కాదు.. అభయారణ్యాల్లో సంచరించే అడవుల్లోని అన్నలను కూడా వదలడంలేదు.. ఇప్పటికే పలువురు మావోయిస్టులు కరోనాతో మృతిచెందినట్టు పోలీసులు ప్రకటిస్తుండదా.. అందులో కొందరు కోవిడ్‌కు బలిఅయినట్టు.. మావోయిస్టులు ప్రకటించిన సంగతి తెలిసిందే.. తాజాగా, మావోయిస్టు కీలక నేత వినోద్‌.. మహమ్మారి బారినపడి మృతిచెందారు.. ఎన్‌ఐఏకి మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న వినోద్‌పై రూ.15 లక్షల రివార్డు కూడా ఉంది.. మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న వినోద్‌… జీరం అంబుష్‌, ఎమ్మెల్యే బిమా మాండవి మృతి వెనుకాల మాస్టర్‌ మైండ్‌గా చెబుతారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా ఉన్న వినోద్.. కరోనాతో మృతిచెందినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ధృవీకరించారు.. గత కొన్ని రోజులుగా వినోద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరణించినట్లు ఆయన వెల్లడించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-