మావోయిస్టు కీలక నేత అరెస్ట్.. రూ.20 లక్షల రివార్డు..!

మావోయిస్టు కీలక నేతను అరెస్ట్‌ చేశారు పోలీసులు.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టు కీలక నేత మోతీరామ్‌ను అరెస్ట్ చేశారు.. మోతీరామ్‌పై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్టుగా చెబుతున్నారు పోలీసులు.. గతంలో సుక్మా జిల్లాలో 76 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను బంధించి.. చంపిన ఘటనలో మోతీరామ్‌ కీలక సూత్రధారిగా పోలీసులు చెబుతున్నారు. మోతీరామ్‌పై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయి.. కాగా, ఈ మధ్య మావోయిస్టు ఉద్యమానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూ వస్తున్నాయి.. ఈ మధ్యే ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయిన సంగతి తెలిసిందే కాగా.. ఇప్పుడు మోతీరామ్‌ పోలీసులకు చిక్కాడు. కరోనా మహమ్మారి కూడా మావోయిస్టు కీలక నేతలను ఉక్కిరిబిక్కిరి చేసిన విషయం విదితమే.

Related Articles

Latest Articles

-Advertisement-