వర్షాలు, వరదలు.. పలు రైళ్లు రద్దు, రీషెడ్యూల్‌

భారీ వర్షాలు, వరదలు పలు రైళ్లు రద్దు చేయడానికి.. కొన్ని రీషెడ్యూల్‌ చేయడానికి దారితీశాయి.. సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే పరిధిలోని హౌరా, టికియపరా స్టేషన్ల వద్ద వర్షం నీరు చేరడంతో పలు రైళ్లు రద్దు, దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. యశ్వంత్‌పూర్‌-హౌరా రైలును రద్దు చేశారు. ఈశాన్య సరిహద్దు రైల్వే పరిధిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో సిలిచర్‌లో బయలుదేరే సిలిచర్‌-త్రివేండ్రం, ఐదున గౌహతిలో బయలుదేరే గౌహతి-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు… న్యూ కూచ్‌ బెహర్‌, మాతాభాంగ్‌, టీస్తా, రాణినగర్‌ మీదుగా నడుస్తున్నాయి.

-Advertisement-వర్షాలు, వరదలు.. పలు రైళ్లు రద్దు, రీషెడ్యూల్‌

Related Articles

Latest Articles