‘ఆ పని చేయలేక’ మనోజ్ బాజ్ పాయ్ భార్య నటనకు దూరమైందట!

‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సక్సెస్ తో ఇప్పుడు అందరి దృష్టీ మనోజ్ బాజ్ పాయ్ మీద పడింది. ఆయన నటన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేం లేకున్నా ‘సత్య’ మూవీ యాక్టర్ గురించి ఈ తరం ఓటీటీ జెనరేషన్ కి మరీ ఎక్కువ తెలియదనే చెప్పాలి. అందుకే, ఆయన పెద్ద తెర మీద కన్నా ఇప్పుడు బుల్లితెర పై వెబ్ సిరీస్ లతో హల్ చల్ చేస్తున్నాడు. సరికొత్తగా ఈ తరం ప్రేక్షకుల్ని తన నటనతో ఆకట్టుకుంటున్నాడు…

‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ లో టైటిల్ రోల్ పోషించిన మనోజ్ బాజ్ పాయ్ రియల్ లైఫ్ లోనూ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యానే! ఆయన 2006లో షబానాని పెళ్లాడాడు. వారికి ఓ కూతురు కూడా ఉంది. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే… మనోజ్ భార్య షబానా కూడా ఆర్టిస్టే! ఆమె పలు చిత్రాల్లో నటించింది. అయితే, అప్పట్లో ఆమె పేరు నేహ. 1998లో విడుదలైన ‘కరీబ్’ చిత్రంతో వెండి తెర మీద తళుక్కుమంది. ఆపైన ‘హోగీ ప్యార్ కీ జీత్, ఫిజా, అలీబాగ్’ లాంటి సినిమాల్లో వివిధ పాత్రల్లో మెప్పించింది. అయితే, షబానా నటిగా ఎప్పుడూ పెద్దగా కమర్షియల్ బ్రేక్ పొందలేకపోయింది. దాంతో ఆఫర్లు క్రమంగా తగ్గటం మొదలయ్యాయట. ఇక అప్పుడు సినిమాల కోసం వార్నీ, వీర్నీ బతిమాలటం తన వల్ల అయ్యే పని కాదని డిసైడ్ అయింది. వెంటనే మిస్ షభానా మిసెస్ మనోజ్ బాజ్ పాయ్ గా సెటిలైపోయింది!

తన స్క్రీన్ నేమ్ నేహా నుంచీ ఒరిజినల్ నేమ్ షబానాకు మారిపోయిన మిసెస్ బాజ్ పాయ్… నటిగా కొనసాగనందుకు తనకేమీ అసంతృప్తి లేదని చెప్పటం విశేషం. మిసెస్ మనోజ్ గానే నేను హ్యాపీ అంటోంది!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-