సమంత, ప్రియమణి గురించి మనోజ్ బాజ్ పాయ్ ఏమన్నాడంటే…

సమంత, ప్రియమణి నాకంటే బెటర్ గా యాక్ట్ చేశారు అంటున్నాడు మనోజ్ బాజ్ పాయ్. ఆయన సౌత్ బ్యూటీస్ ఇద్దరితో కలసి ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’లో నటించాడు. ప్రియమణి, మనోజ్ బాజ్ పాయ్ సీజన్ వన్ లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కాగా రెండో సీజన్లో అక్కినేని సమంత అందర్నీ ఆశ్చర్యపరిచింది. కొంత వివాదాస్పదం అయినప్పటికీ బోల్డ్ క్యారెక్టర్ లో సామ్ సత్తా చాటింది.

‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ సక్సెస్ తరువాత, అందులో టైటిల్ రోల్ పోషించిన మనోజ్ బాజ్ పాయ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. నిజానికి తన బిగ్ స్క్రీన్ వర్క్ ఈ తరం ఆడియన్స్ కి పెద్దగా తెలియదని చెప్పిన ఆయన ఓటీటీ వల్ల న్యూ జెనరేషన్ ఫ్యాన్స్ కూడా తనని అభిమానిస్తున్నారని అన్నాడు. టీనేజ్ పిల్లలు కూడా తనతో సెల్ఫీలు దిగినప్పుడు హ్యాపీగా ఉంటుందని చెప్పాడు. అలాగే, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వల్ల తన లాంటి నటులకి మంచి స్కోప్ లభించిందని బాజ పాయ్ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ నిరంతరం ఎదుగుతూ ఉంటేనే డిమాండ్ ఉంటుందని, టాలెంట్ కి వెండితెర మీద కన్నా ఇక్కడ ఎక్కువ విలువ ఉంటోందని వివరించాడు.

‘ద ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ వన్ లోని తన పర్ఫామెన్స్ కిగానూ మనోజ్ బాజ్ పాయ్ ఉత్తమ ఫిల్మ్ పేర్ అందుకున్నాడు. చూడాలి మరి, ఈసారి అవార్డ్స్ సీజన్లో ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ హంగామా ఎలా ఉంటుందో!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-