ప్ర‌పంచంలో ఇలాంటి ఎడారిని ఎక్క‌డా చూసుండ‌రు…ఎందుకంటే…

ఎడారిలో ఎటు చూసినా ఇసుక తప్పించి మ‌రేమి క‌నిపించ‌దు.  ఒయాసిస్సులు ఉన్న చోట మాత్ర‌మే చెట్లు క‌నిపిస్తాయి.  ముళ్ల చెట్లు, నాగ‌జెముడు, బ్ర‌హ్మ‌జెముడు వంటివి మాత్ర‌మే క‌నిపిస్తుంటాయి.  ఎవ‌రూ కూడా కావాల‌ని ఏరికోరి ఎడారి ప్రాంతాల‌కి పిక్నిక్‌ల‌కు వెళ్ల‌రు.  కానీ, అమెరికాలోని ఫ్రీఫోర్డ్ అనే ప‌ట్ట‌ణానికి స‌మీపంలో మైనె డెజ‌ర్ట్ అనే ఎడారి ప్రాంతం ఉంటుంది.  ఇది మిని ఎడారి అనుకోవాలి.  ఇది సుమారు 40 ఎక‌రాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంటుంది.  అదేంటి ఎడారి అంటే వంద‌ల కిలోమీట‌ర్ల‌మేర ఇసుక ఉండాలి క‌దా అలా కాకుండా ఇసుక ఉండ‌టం ఏంట‌ని అనుకుంటున్నారా… అక్క‌డికే వ‌స్తున్న‌.  

Read: వైర‌ల్‌: ఈ ముస‌లోడు మాములోడు కాదు… మాస్‌రాణితో… ఇర‌గ‌దీశాడు…

ఇది స‌హ‌జ‌సిద్ధంగా ఏర్ప‌డిన ఎడారి కాదు.  మ‌నిషి నిర్మించిన ఎడాది ప్రాంతం.  సుమారు వందేళ్ల క్రితం ఈ ప్రాంతం వ్య‌వ‌సాయానికి అనుకూలంగా ఉండేది.  అక్క‌డ గోధుమ‌, ఇత‌ర ఆహార ధాన్యాల పంట‌లు పండేవి.  అయితే, వాతావ‌ర‌ణంలో అనూహ్య‌మైన మార్పుల కార‌ణంగా భూసారం కోల్పోయి వ్య‌వసాయానికి కాకుండా పోయింది.  ఆ త‌రువాత అక్క‌డి వారు వ‌ల‌స వెళ్లిపోయారు.  దానిని 1919లో హెన్నీ గోల్డ్‌ర‌ప్ అనే వ్య‌క్తి కోనుగోలు చేశాడు.  భూసారం లేకుండా ఎండిపోయిన ఆ ప్రాంతాన్ని అంద‌మైన ఎడారిగా మారిస్తే ఎలా ఉంటుంద‌ని అలోచ‌న చేశాడు.  వెంట‌నే ఎడారి ప్రాంతం నుంచి ఇసుక‌ను తెప్పించి ఎడారిలో ఉండే విధింగా మార్చేశాడు.  అక్క‌డ‌క్క‌డా చెట్ల‌ను పెంచారు.  ఇప్పుడు ఆ ప్రాంతం ప‌ర్యాట‌క ప్రాంతంగా మారిపోయింది.  మ‌నిషి త‌యారు చేసిన ఎడారిని చూసేందుకు ఏడాది పోడ‌వున ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు.  

Related Articles

Latest Articles