కథ చెప్పేందుకు రెడీ అవుతోన్న కాస్ట్యూమ్ డిజైనర్!

సినీ ప్రపంచంలో అందరి అంతిమ లక్ష్యం డైరెక్టర్ అనిపించుకోవటమే! కానీ, చాలా మంది టాప్ స్టార్స్, కెమెరామెన్, రైటర్స్, ఈవెన్ చేతిలో బోలెడు డబ్బులున్న ప్రొడ్యూసర్స్ కూడా ఆ రిస్క్ చేయరు! ఎందుకంటే, దర్శకత్వం ఆషామాషీ కాదు. మొత్తం సినిమా భారమంతా డైరెక్టర్ మీదే ఉంటుంది. పడవ తేలినా, మునిగినా తనదే బాధ్యత…

30 ఏళ్లుగా బాలీవుడ్ లో ఫ్యాషన్ కు మారుపేరుగా మారిన మనీశ్ మల్హోత్రా ఇప్పుడు డైరెక్షన్ రిస్క్ చేయబోతున్నాడు. ఆయన డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ తోనే శ్రీదేవి మొదలు జాన్వీ కపూర్ దాకా చాలా మంది పెద్ద తెరపై వెలిగిపోయారు. తరతరాల బాలీవుడ్ అందాల భామలకు అలంకరణలు చేసిన మనీష్ ఇప్పుడు కొత్త అడుగు వేయబోతున్నాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో వివిధ చోట్ల వెలుగు చూసిన కథనాల్ని ఆయన షేర్ చేశాడు. వాటన్నిటి సారాంశం మనీశ్ మల్హోత్రా డైరెక్టర్ కాబోతున్నాడనే! ఆ స్టోరీస్ షేర్ చేయటంతో డైరెక్షన్ కు రెడీ అని చెప్పకనే చెప్పినట్లు అయింది…

మనీశ్ మల్హోత్రా లాంటి స్టార్ ఫ్యాషన్ డిజైనర్ రంగంలోకి దిగితే శుభాకాంక్షలకు కొదవా? జాన్వీ కపూర్, భూమి పెడ్నేకర్ పరిణీతి చోప్రా, నేహా ధుపియా, సోఫీ చౌదరీ, ఇంకా చాలా మంది ‘కంగ్రాట్స్’ అంటూ తమ మద్దతు ప్రకటించారు. అయితే, మనీశ్ మల్హోత్రా డెబ్యూ డిరెక్టోరియల్ ఎవరితోనో ఇంకా క్లారిటీ లేదు. నిర్మాత మాత్రం మనీశ్ బెస్ట్ ఫ్రెండ్ కరణ్ జోహరే! ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందే మనీశ్ మల్హోత్రా మాగ్నమ్ ఓపస్ లో లక్కీ చాన్స్ ఏ హీరో, హీరోయిన్ని వరిస్తుందో… లెట్స్ వెయిట్ అండ్ వాచ్!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-