నితిన్ మాతో హీరోలాగా లేడు: సింగర్ మంగ్లీ

బాలీవుడ్ హిట్ చిత్రం ‘అంధాదున్’కి రీమేక్ గా తెలుగులో ‘మాస్ట్రో’ వస్తున్న సంగతి తెలిసిందే.. నితిన్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించగా.. హిందీలో టబు చేసిన పాత్రలో తమన్నా నటించింది. సెప్టెంబర్ 17న డిస్నీ హాట్ స్టార్‌లో రాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరిగింది. ఇక ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో నటిసున్న సింగర్ మంగ్లీ ‘మాస్ట్రో’ చిత్రాన్ని ఉద్దేశించి మాట్లాడింది. ‘ఈ సినిమాలో నాకు ఓ మంచి పాత్ర ఇచ్చారు. అది నాకు బాగా సెట్ అయ్యే పాత్ర.. నితిన్ సపోర్ట్ మర్చిపోలేనిది. నితిన్ కు ఒక హీరో అనే ఫీలింగ్ లేకుండా చాలా సాధారణంగా మాతో కలిసిపోయారు.. చాలా ఫ్రెండ్లీగా, ఒక బ్రదర్ బాగా చూసుకున్నారు’ అని మంగ్లీ తెలిపింది. మరి ఆ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Latest Articles

-Advertisement-