దావూడ్ ఇబ్రహీం ప్రేయసిగా పేరుబడ్డ… లెజెండ్రీ యాక్ట్రస్ తిరిగి వచ్చేస్తోంది!

మందాకిని మళ్లీ తెరపైకి వచ్చేస్తోంది! లెజెండ్రీ బాలీవుడ్ యాక్ట్రస్ ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ పరిశీలిస్తోందట. అయితే, ఇంకా ఏ సినిమా లేదా వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలన్నది 57 ఏళ్ల సీనియర్ నటి నిర్ణయించుకోలేదు. ఆమెకు నచ్చిన ప్రాజెక్ట్ ఎదురైతే అధికారిక ప్రకటన చేస్తుందని మందాకినీ మ్యానేజర్ మీడియాతో తెలిపాడు. త్వరలోనే ‘రామ్ తేరీ గంగా మైలీ’ సూపర్ స్టార్ ఆసక్తికరమైన పాత్రతో తెర మీదకు మాత్రం తప్పక వస్తుందని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు…

మందాకిని 1980లలో కుర్రాళ్లను ఊపేసింది! బాలీవుడ్ సినిమాల్లో తన గ్లామర్ తో అలజడి సృష్టించింది. రాజ్ కపూర్ ‘రామ్ తేరీ గంగా మైలీ’ ఆమె కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయింది. అయితే, 1990వ దశకం మొదలయ్యాక మందాకిని దావూద్ ప్రేయసి అంటూ ప్రచారం జరిగింది. అతడితో ఆమె ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. చివరకు, ఆమె దుబాయ్ లో దావూద్ తో కాపురం చేసేస్తోందంటూ దుమారం రేగింది. మాఫియా డాన్ తో ఎఫైర్ దెబ్బకు మందాకిని కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. ఆమె మళ్లీ మళ్లీ తిరిగి లైమ్ లైట్లోకి వచ్చే ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు. చివరి సారిగా 2002లో ఓ బెంగాలీ సినిమాలో కనిపించింది మందాకిని. ఆ తరువాత రెండు దశాబ్దాలుగా ఆమె తెరమరుగైపోయింది.

మందాకిని హిందీ, బెంగాలీ సినిమాలే కాదు తెలుగులోనూ కొన్ని చిత్రాలు చేసింది. ఆమె పట్ల చాలా మందిలో ఇప్పటికీ ఆసక్తి చాలానే ఉంది. 57 ఏళ్ల మందాకిని కమ్ బ్యాక్ కోసం ఎలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటుందో చూడాలి మరి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-