ప్రకాష్ రాజ్ ఓ అపరిచితుడు.. రియల్ లైఫ్‌లో కూడా యాక్ట్ చేస్తారు: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 60 మందితో పోస్టల్ బ్యాలెట్ లో తమకు అనుకూలంగా మంచు విష్ణు ఓటు వేయించుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేయగా.. మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని మంచు విష్ణు మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. దింతో మా వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా మంచు విష్ణు ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశం నిర్వహించి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

మంచు విష్ణు మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ కు ఎవరైనా బీపీ మాత్రలు ఇస్తే బాగుంటుంది. అపరిచితుడుగా ప్రవర్తిస్తున్నాడు.. చిన్న చిన్న విషయాలకు ‘మా’ పరువు తీస్తున్నాడు. ఆయన రియల్ లైఫ్ లో కూడా యాక్ట్ చేస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వద్దని ఎలక్షన్ కమిషన్ కి చెప్పను. మా ప్యానెల్ సభ్యులు కూడా పేపర్ బ్యాలెట్ కి వెళదాము అని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ 60సంవత్సరాలు పై బడిన వారికి పోస్టల్ ఓట్ వుంది. 180 నుంచి 190 మంది దాకా 60 సంవత్సరాలు దాటిన వారు వున్నారు. వాళ్లకు నేను కాల్ చేసి మాట్లాడాను వాళ్ళల్లో కొందరు వస్తాము ఓటు వేస్తాము కొందరు పోస్టల్ బ్యాలెట్ అని అన్నారు.

ప్రతి ఒక్కరూ మీకు పోస్టల్ బ్యాలెట్ కావాలి అంటే 500 రూపాయలు కట్టమన్నారు. పరుచూరి బ్రదర్స్ సత్యం యాబి లాంటి పెద్ద వారు నాకు కాల్ చేశారు ఇదేంటి 500 అని.. అయితే నేను మీ తరుపున కట్టిస్తాను మీరు తరువాత పంపించండి అని చెప్పాను. దానికి ప్రకాష్ రాజ్ విషయం తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడతాడు. పెద్దలకు గౌరవం ఇవ్వలేని వాడు ఏమి చేస్తాడు..? కృష్ణ, కృష్ణంరాజు నీ ప్రకాశ్ రాజ్ అవమానిస్తారా..? తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీ లో ప్రకాష్ రాజ్ గురించి ఎవరినడిగినా చెపుతారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడేది చాలా తప్పు.. ఓటు అడిగే హక్కు నాకుంది నేను రైట్ వే లో వున్నాను. ఇక్కడ ‘మా’ ఇల్లు నీ పాడు చేసేందుకు కంకణం కట్టుకున్నాడు’ అని మంచు విష్ణు ఎద్దేవా చేశారు.

-Advertisement-ప్రకాష్ రాజ్ ఓ అపరిచితుడు.. రియల్ లైఫ్‌లో కూడా యాక్ట్ చేస్తారు: మంచు విష్ణు

Related Articles

Latest Articles