జీవిత గారు.. నాన్నతో రాజశేఖర్ ఏమాట్లాడారో మీకు తెలీదు: మంచు విష్ణు

‘మా’ ఎన్నికలకు సంబంధించి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మా ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని మంచు విష్ణు మా ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. దింతో మా వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా మంచు విష్ణు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

Read Also: ప్రకాష్ రాజ్ ఓ అపరిచితుడు.. రియల్ లైఫ్‌లో కూడా యాక్ట్ చేస్తారు: మంచు విష్ణు

మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘జీవిత గారు మీరు చెప్పేది కరెక్ట్ గా చెప్పండి.. నాలుగు రోజులు ముందు రాజశేఖర్ గారు వచ్చి మోహన్ బాబు గారితో ఏమి చెప్పారో మీకు తెలీదు. ఉమ్మడి కుటుంబంలో కొన్ని సమస్యలు వుంటాయి వాటిని రోడ్డు మీదకు తీసుకురావద్దు. నా గురించి మాట్లాడండి, కానీ నా ఫ్యామిలీ గురించి మాట్లాడవద్దు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ‘మా’ ఫ్యామిలీనీ విడగొట్టొద్దు ఇది ‘మా’ ఫ్యామిలీ మన ఫ్యామిలీ.. జీవిత గారు నా ఫాదర్ నేమ్ నీ సంబోధించవద్దు.. శ్రీహరి గారు వుంటే ఈ రోజు వేరేలా ఉండేది. నాకు నా తండ్రి సపోర్ట్ వుంది’ అంటూ విష్ణు జీవితకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

-Advertisement-జీవిత గారు.. నాన్నతో రాజశేఖర్ ఏమాట్లాడారో మీకు తెలీదు: మంచు విష్ణు

Related Articles

Latest Articles