శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై ఆరా తీసిన మంచు విష్ణు

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా పాజిటివ్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా స్పందించారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆస్పత్రి వైద్యులతో తాను మాట్లాడినట్లు తెలిపాడు. ఆయన రెండో కుమారుడు అజయ్‌తో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పానని పేర్కొన్నాడు.

Read Also: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పూజా హెగ్డే

శివశంకర్ మాస్టర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని మంచు విష్ణు భరోసా కల్పించాడు. వైద్యులు కూడా ఆయన ఆరోగ్యం కోసం ఎంతో శ్రమిస్తున్నారని… త్వరలోనే మాస్టర్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నాడు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్య, పెద్ద కుమారుడు కూడా కరోనాతో బాధపడుతున్నారు. దీంతో ఆస్పత్రి బిల్లులు కట్టేందుకు శివశంకర్ మాస్టర్ కుటుంబం ఆర్థిక ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకుని ఇప్పటికే సోనూసూద్, ధనుష్ లాంటి స్టార్లు తమకు తోచిన సహాయం అందించారు.

Related Articles

Latest Articles