నామినేషన్ వేసిన మంచు విష్ణు.. పవన్ కామెంట్స్ ను ఏకిభవించను

మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు, మరియు అతని ప్యానెల్ సభ్యులు నేడు నామినేషన్ దాఖలు చేశారు. మంచు విష్ణు భారీ ర్యాలీతో ఫిలిం ఛాంబర్ కు వచ్చి నామినేషన్ వేశారు. అనంతరం ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు నామినేషన్ పత్రాలను అందచేశారు. ఈ క్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ, హాట్ కామెంట్స్ చేశారు.

‘ఈ రోజు మా ఎన్నికల్లో మా ప్యానెల్ సభ్యులం అందరం నామినేషన్లు వేసాము. 10న ఎన్నికలు జరుగుతాయి.. మేము గెలుస్తామని ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్నాము. ఇది ప్రతి తెలుగు నటుల ఆత్మగౌరవ పోరాటం.. నా వెనుక జగన్ గారు వున్నారు అని మీడియానే రాస్తుంది. నాకు 900 మంది సభ్యుల మద్దతు వుంది.

నా మ్యానిఫెస్టో చూసిన తరువాత చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఓట్లు వేస్తారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నాన్న గారు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ కోసం మాట్లాడిన మాటలు నేను ఏకిభవించటం లేదు. నేను తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైపు వున్నాము. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వున్నాము.. ఛాంబర్ తీసుకున్న స్టాండ్ కు మేము కట్టుబడి వున్నాము. మరి ప్రకాష్ రాజ్ గారు ఎవరి వైపు వున్నారో చెప్పమనండి’ అంటూ మంచు విష్ణు కామెంట్స్ చేశారు.

-Advertisement-నామినేషన్ వేసిన మంచు విష్ణు.. పవన్ కామెంట్స్ ను ఏకిభవించను

Related Articles

Latest Articles