అపోలోకు చేరుకున్న మంచు విష్ణు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు బైక్ ప్రమాదం అని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కు గురైయ్యారు.. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా సాయి తేజ్ కోలుకోవాలని, ప్రార్థిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు ఆయన్ను చూడ్డానికి ఆసుపత్రికి వస్తున్నారు. సాయి ధరమ్ తేజ్‌ను చూసేందుకు మంచు లక్ష్మీ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మంచు లక్ష్మీకి మెగా హీరోలకు మంచిస్నేహ బంధం ఉందన్న సంగతి తెలిసిందే. మరికాసేపటికి క్రితమే హీరో మంచు విష్ణు కూడా అపోలో ఆస్పత్రికి చేరుకొని మెగా కుటుంబ సభ్యులను కలిశారు.

అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురి అవ్వడంపై రకరకాల కామెంట్లు, రూమర్లు వచ్చాయి. అయితే ఆ రోడ్డు మీదున్న మట్టి, ఇసుక వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ‘రూమర్లను వ్యాప్తి చేయకండని అందరినీ కోరుకుంటున్నాను. ప్రాణాపాయ స్థితి నుంచి సాయిధరమ్ బయటపడ్డారు.. ఇది మనం సెలెబ్రేట్ చేసుకోవాల్సిన విషయం..’ అంటూ మంచు లక్ష్మి ట్వీట్స్ కూడా చేసి అందరి నోళ్లు మోయించింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-