మా ఎన్నికల లొల్లి.. ప్రకాష్ రాజ్ ప్రత్యర్థులు రెడీ

‘మేమంతా కళామతల్లి ముద్దుబిడ్డలం.. మాకు కులం.. మతం.. జాతి బేధాలు ఉండవు.. మమ్మల్ని ఎవరూ విడదీయలేరని’ పదేపదే సినీనటులు చెబుతూ ఉంటారు. అయితే వీరిని ఎవరినీ విడదీయకుండానే వీళ్లలో వీళ్లే చిచ్చు పెట్టుకుంటున్నారు. ‘మా’ ఎన్నికల సాక్షిగా ఒకరిపై ఒకరు మీడియా ముఖంగా ఆరోపణలకు దిగుతున్నాయి. ఈక్రమంలోనే సీనిపెద్దలు రంగంలోకి దిగి బహిరంగంగా విమర్శలు చేసుకోవద్దంటూ లేఖాస్త్రలను సంధిస్తున్నారు. ఇలాంటి సమయంలో ‘మా’ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో ఈ లొల్లి మరింత పీక్స్ కు చేరుకోవడం ఖాయంగా కన్పిస్తోంది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను గతంలోనే నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే మా ఎన్నికలకు సిద్ధంగా ఉన్న ప్రకాశ్ రాజ్ ఎన్నికలను త్వరగా నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. ఈక్రమంలోనే ‘మా’లో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నారు. సినీ పెద్దల జోక్యంతో ఎన్నికలు నిర్వహించేందుకు ‘మా’ రెడీ అయ్యింది. అక్టోబర్ 10న ఆదివారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‏లో ‘మా’ ఎలక్షన్ జరుగనుంది. ఆరోజు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ నిర్వహించి సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు.

Read Also : అఫిషియల్ : మంచు విష్ణు “మా” ప్యానల్

గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘మా’ అధ్యక్ష పదవిని దక్కంచుకునేందుకు సినీనటులు పోటీపడుతున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణు, నటులు సీవీఎల్ నరసింహారావు, బండ్ల గణేష్ పోటీలో ఉన్నారు. బండ్ల గణేష్ మొదట ప్రకాశ్ రాజ్ ప్యానల్లో ఉన్నారు. అయితే ఆ ప్యానల్లోకి జీవితా రాజశేఖర్ చివరి నిమిషంలో చేరడంతో ఆయన ఆ ప్యానల్ నుంచి తప్పుకొని ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తున్నారు. ఆయన ‘మా’ సెక్రటరీ పదవి కోసం పోటీపడుతున్నాడు. అలాగే నటి హేమ సైతం అధ్యక్ష పదవి బరిలో ఉన్నట్లు కన్పించినా చివరి నిమిషంలో ఆమె సైతం ప్రకాష్ రాజ్ ప్యానల్లో చేరిపోయారు.

‘మా’ ఎలక్షన్ ప్రధానంగా ప్రకాశ్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్యే ఉండనుంది. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ ను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నాడు. ప్రకాశ్ రాజ్ కు మెగా బ్రదర్ నాగబాబు ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. అయితే పరోక్షంగా మెగా కుటుంబం సపోర్టు ఆయనకే ఉందని తెలుస్తోంది. మరోవైపు మంచు విష్ణు నేడు తన ప్యానల్ ను ప్రకటించేశారు. ఆయన ప్యానల్ నుంచి సీనియర్ నటుడు బాబు మోహన్ వైస్ ప్రెసిడెంట్ గా, రఘుబాబు జనరల్ సెక్రటరీగా పోటీ చేయనున్నారు.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు ధీటుగా మంచు విష్ణు ప్యానెల్ ఉండడంతో పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.

Read Also : ‘మా’ ఎన్నికలపై కామెంట్స్… నానిపై సినీ పెద్దల అసంతృప్తి ?

ఈ ఎన్నికలు ప్రధానంగా ‘మా’ బిల్డింగ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకరు బిల్డింగ్ అంశాన్ని ప్రధానంగా హైలెట్ చేస్తుండగా మరొకరు బిల్డింగ్ తోపాటు సంక్షేమ కార్యక్రమాలపై ఫోకస్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఈసారి ‘మా’ బిల్డింగ్ నిర్మించుకోవడం ఖాయంగా కన్పిస్తోంది. మంచు విష్ణుకు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నందమూరి బాలకృష్ణ, మరికొందరు సీనియర్లు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేవలం 900మంది సభ్యులు ఉన్న ‘మా’ అసోసిషన్ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ ని తలపిస్తుండటం విడ్డూరంగా మారింది.

-Advertisement-మా ఎన్నికల లొల్లి.. ప్రకాష్ రాజ్ ప్రత్యర్థులు రెడీ

Related Articles

Latest Articles