“అలయ్ బలయ్”లో నేను, పవన్ మాట్లాడుకున్నాము : మంచు విష్ణు

‘మా’లో వివాదం ఇంకా వాడివేడిగా సాగుతూనే ఉంది. అందరినీ కలుపుకుపోతామని చెబుతూ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ఇటీవలే ప్రమాణ స్వీకారం సైతం చేశారు. అయితే ఈ ఎన్నికలు మంచు, మెగా ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టాయని అందరూ భావిస్తున్నారు. నిన్న జరిగిన “అలయ్ బలయ్” కార్యక్రమంలో కూడా మంచు, విష్ణు, పవన్ కళ్యాణ్ మాట్లాడుకోకపోవడం మీడియాలో హైలెట్ అయ్యింది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

Read Also : “సర్కారు వారి పాట” అప్డేట్ ఇచ్చిన తమన్

విష్ణు మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ గారు, మేము అందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్. స్టేజ్ ఎక్కక ముందు చాలా సేపు మాట్లాడుకున్నాం. నేను పవన్ కళ్యాణ్ గారిని ఒకటి అడిగాను అదేంటో ఇప్పుడే చెప్పను. కానీ ఆయన ఒక మాట అన్నారు. ‘ఇది మన తల్లి జాగ్రత్తగా చూసుకో విష్ణు’ అన్నారు. స్టేజ్ పై మాట్లాడుకోలేదంటే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అక్కడే ఉన్నారు. నాకు, పవన్ కు సత్కారం జరిగింది. ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది కదా. మేము మాట్లాడుకున్నది షూట్ చేయలేదు మీరు… కానీ స్టేజ్ పై మాట్లాడుకోలేదు అంటూ హైలెట్ చేశారు. పవన్ కళ్యాణ్ స్టార్… ఆయన ఆశీస్సులు, సలహాలు ‘మా’కు కావాలి. ట్విట్టర్ లో వీడియో షేర్ చేశానంటే ఆయన అభిమానులకు సర్ప్రైజ్ ఇద్దామని… అంతేకాని అందులో వేరే ఉద్దేశం లేదు” అంటూ క్లారిటీ ఇచ్చారు.

Related Articles

Latest Articles