సీసీటీవీ ఫుటేజ్ వివాదంపై మంచు విష్ణు కామెంట్స్

‘మా’ కొత్త అధ్యక్షుడు విష్ణు మంచు, అతని ప్యానెల్ సోమవారం ఉదయం తిరుమలను సందర్శించి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. విఐపి దర్శనం సమయంలో విష్ణు తండ్రి, ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన సోదరి లక్ష్మి మంచుతో పాటు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ప్రస్తుతం వివాదాస్పదమైన సీసీటీవీ ఫుటేజ్ గురించి స్పందించారు.

Read Also : “అలయ్ బలయ్”లో నేను, పవన్ మాట్లాడుకున్నాము : మంచు విష్ణు

“గెలుపు ఓటములు సర్వసాధారణం. వెయ్యి శాతం వాళ్ళు సిసిటీవి పుటేజ్ చూసుకోవచ్చు. గెలిచింది మేమే… అన్ని బహిరంగంగానే జరిగాయి. మేము ఇద్దరమే కలిసి పేపర్లు సపరెట్ చేశాము. పోస్టల్ బ్యాలెట్ ఓపన్ చేయకముందే నేను గెలిచాను అని ప్రకాష్ రాజ్ చెప్పుకున్నారు. మా నాన్న కోపం అందరికీ తెలుసు. పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత మాపై దాడి చేశారు అని వాళ్ళు చెప్పడం విడ్డూరంగా ఉంది. సిసి ఫుటేజ్ లను వాళ్ళు చూసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ ఇబ్బంది లేకపొతే సిసిటివి ఫుటేజ్ అందరికీ పంచుకొండి. మా వల్ల జూబ్లీ పబ్లిక్ స్కూల్ కు ఇబ్బంది కలిగింది. వారికి క్షమాపణ చెబుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ ను చూడడానికి ప్రకాష్ రాజ్ బృందం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వద్దకు చేరుకున్నారు.

Related Articles

Latest Articles