చిన్నారిపై హత్యాచారం… మంచు మనోజ్ పరామర్శ

సైదాబాద్, సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనకు పాల్పడ్డ మృగాన్ని చంపేయాలంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అభం శుభం తెలియని చిన్న వయసులోనే ఆ చిన్నారి హత్యాచారానికి గురవ్వడం పాప కుటుంబ సభ్యులతో పాటు అందరినీ కలచి వేసింది. తాజాగా చిన్నారి కుటుంబ సభ్యులను మంచు మనోజ్ పరామర్శించారు. చిన్నారి మరణంతో తీరని శోకంలో మునిగిపోయిన ఆ తల్లిదండ్రులను మనోజ్ ఓదార్చారు.

Read Also : నేను తాగుతా… అన్ని అలవాట్లు ఉన్నాయ్ : బిగ్ బాస్ లహరి

చిన్నారికి జరిగింది కౄరత్వమని, మనందరం బాధ్యత తీసుకోవాలని, ఆడపిల్లలను ఎలా గౌరవించాలో అందరికీ నేర్పాలని ఆయన అన్నారు. ఇంకా నిందితుడు దొరకలేదని పోలీసులు అంటున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకోవాలి. చత్తీస్ఘడ్ లో మూడేళ్ళ క్రితం చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ఉరి శిక్ష వేయాలని ఇప్పుడు తీర్పు వచ్చింది. కానీ 24 గంటల్లో నిందితుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. టీవీ చానళ్లలో సాయి ధరమ్ తేజ్ గురించి యానిమేషన్లు వేయకుండా, ఇలాంటి వాళ్లకు న్యాయం జరిగేలా చూడాలని ఫైర్ అయ్యారు. చిన్నారి ఫామిలీ కి ఎల్లవేళలా తోడుగా ఉంటామని మనోజ్ హామీ ఇచ్చారు.

Related Articles

Latest Articles

-Advertisement-