మంచు వారి ఇంటిలో మరో కొవిడ్ కేసు!

గత యేడాది చివరి వారంలో మంచు మనోజ్ కుమార్ కరోనా బారిన పడ్డాడు. ఆరోగ్యం బాగానే ఉన్నా, కొవిడ్ టెస్టు చేయించుకున్నప్పుడు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇప్పుడు అదే కరోనా… మంచు లక్ష్మీని పట్టుకుంది. దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా బారి పడకుండా తప్పించుకున్నానని, ఆ దోబూచులాటలో చివరకు ఇప్పుడు దాని చేతికి చిక్కిపోయానని మంచు లక్ష్మీ తెలిపింది. ఇదే సమయంలో ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం కూడా మంచు లక్ష్మీ చేసింది.

సాధారణ జలుబు మాదిరిగా కరోనా మనల్ని వచ్చి చేరుతుందని, దానిని తట్టుకునేలా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని, విటమిన్ టాబ్లెట్స్ ను తీసుకోవాలని సలహా ఇచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మీ, మలయాళంలో మోహన్ లాల్ నటిస్తున్న ఓ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తోంది. అందుకోసం కలరీ యుద్ధ విద్యనూ ఆమె అభ్యసిస్తోంది.

మంచు వారి ఇంటిలో మరో కొవిడ్ కేసు!

Related Articles

Latest Articles